Lakshmi: మిఠాయిలనుకుని విషపు గుళికలు తినడంతో.. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!

  • ఆడుకుంటుండగా దొరికిన విషపు గుళికలు
  • అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నారులు
  • పరిస్థితి విషమించడంతో ‘రుయా’కు తరలింపు

ఆడుకుంటున్న నలుగురు చిన్నారులకు విషపు గుళికలు దొరికాయి. వాటిని మిఠాయిలుగా భావించి తినడంతో నలుగురూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలోని కండ్రిగ మండలం.. ఆలతూరు పంచాయతీలోని పట్టాభి కాలనీకి చెందిన లక్ష్మి(3), అమ్ములు(3), అశ్విని(5), ప్రవీణ్(7) అనే చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా వారికి విషపు గుళికలు దొరికాయి.

వాటిని మిఠాయిలుగా భావించి తినడంతో నలుగురూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చిన్నారుల పరిస్థితి మరింత విషమించడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

Lakshmi
Ammulu
Aswini
Praveen
Ruya Hospital
Chittor
  • Loading...

More Telugu News