Sara Ali Khan: తన తండ్రి ఎవరన్న ప్రశ్నకు సరదా జవాబు చెప్పిన సారా అలీఖాన్

  • ‘కేదారనాథ్’ మంచి విజయం సాధించింది
  • ‘సింబా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది
  • సారాకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్

కెరీర్ తొలినాళ్లలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆమె తొలి చిత్రం కేదార్‌నాథ్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇటీవల రణ్‌వీర్ సింగ్ సరసన రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సింబా’ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది.

ఈ నేపథ్యంలో అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. తన కోసం గూగుల్‌లో అభిమానులు వివిధ ప్రశ్నలతో తెగ వెతుకుతున్నారు. వాటిలో కొన్నిటికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా జవాబులిచ్చింది. ఇందులో భాగంగా ‘సారా తండ్రి ఎవరు?’ అని గూగుల్‌లో పలువురు వెతికిన ప్రశ్నకు ‘మహాత్మాగాంధీ’ అంటూ టక్కున సరదాగా తనదైన సహజ శైలిలో సమాధానమిచ్చింది. అనంతరం ఈ విషయంలో జోకులు వేయకూడదని.. క్షమించమని వేడుకుని ‘సైఫ్ అలీఖాన్’ అని చెప్పి, 'మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్' అంటూ సర్దిచేప్పింది.

Sara Ali Khan
Saif Ali Khan
Google
Kedaranath
Ranveer Singh
Rohit Shetty
  • Loading...

More Telugu News