vangaveeti radha: ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడే మనస్తత్వం కాదు నాది: వంగవీటి రాధా

  • నా తండ్రి ఆశయాన్ని కొనసాగించేందుకు ప్రజా ప్రయాణం నాకు అవసరం
  • వైసీపీలో ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి
  • నా రాజీనామాను వెంటనే ఆమోదించండి

వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. వైసీపీలో తన ఆకాంక్షలు నెరవేరడం లేదని... ఆకాంక్షలు నెరవేరాలంటే ఎలాంటి ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తనకు అవసరమని చెప్పారు.

తన తండ్రి వంగవీటి రంగా ఆశయాన్ని కొనసాగించేందుకు ప్రజా ప్రయాణం కొనసాగించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఆంక్షలు ఎక్కువగా ఉండటం వల్లే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడే మనస్తత్వం తనది కాదని ఆయన చెప్పారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని వైసీపీ అధినేత జగన్ ను కోరుతున్నానని తెలిపారు.

'ముఖ్యమంత్రి కావాలన్న తమరి ఆకాంక్ష నెరవేరాలంటే పార్టీలోని అందరిపైనా ఆంక్షలు విధించడం తప్పనిసరి అని... తన ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రయాణం తప్పనిసరి' అంటూ రాజీనామా లేఖలో వంగవీటి రాధా పేర్కొన్నారు.

vangaveeti radha
jagan
YSRCP
ranga
resign
  • Loading...

More Telugu News