Telangana: ‘నా కోరిక తీర్చమని నీ కూతురికి చెప్పు’ అంటూ వేధించిన షాపు యజమాని.. ప్రాణాలు తీసుకున్న తల్లి!

  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • ఇంటికెళ్లి బెదిరించిన షాపింగ్ మాల్ ఓనర్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తన దగ్గర పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యజమాని కోరిక తీర్చాల్సిందిగా వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి సదరు వ్యక్తిని నిలదీయగా కుమార్తెను తన దగ్గరకు పంపకుంటే అంతు చూస్తానని ఇంటికెళ్లి బెదిరించాడు. చివరికి ఈ వేధింపులు హద్దుదాటడంతో మనస్తాపానికి లోనైన సదరు తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో ఉన్న మౌనికా షాపింగ్ మాల్ ను వివేకానంద అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇక్కడ భావన అనే అమ్మాయి పనిచేస్తోంది. పనిలో చేరినప్పుడే ఆమెపై కన్నేసిన వివేకానంద.. తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో బాధితురాలు తన బాధను తల్లి కన్యాకుమారికి చెప్పుకుంది. దీంతో యువతి తల్లి వివేకానందను నిలదీసింది.

దీంతో తన కోరికను తీర్చాల్సిందిగా కుమార్తెను ఒప్పించాలని సూచించాడు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో మానసికంగా తీవ్ర వ్యధకు లోనైన కన్యాకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు షాపింగ్ మాల్ యజమాని వివేకానందను అరెస్ట్ చేశారు.

Telangana
Ranga Reddy District
sexual
harrasment
Police
shopping mall
suspect
arrest
  • Loading...

More Telugu News