istambul: మహిళలపై ఇస్తాంబుల్ లోని మున్సిపాలిటీ ఆంక్షలు... వివాదాస్పదం

  • మహిళలపై పలు ఆంక్షలను విధించిన బాగ్ సిలర్ మున్సిపాలిటీ
  • బహిరంగ ప్రదేశాల్లో ఐస్ క్రీమ్ నాకుతూ తినవద్దంటూ నిబంధన
  • ముఖాన్ని కప్పుకోకుండా మాట్లాడవద్దంటూ షరతు

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని బాగ్ సిలర్ మున్సిపాలిటీ ప్రారంభించిన ఓ కార్యక్రమం వివాదాస్పదమైంది. మహిళకు సంప్రదాయాలను నెలకొల్పేందుకు ఈ మున్సిపాలిటీ రెండు నెలల కోర్సును ప్రారంభించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎలా మెలగాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, వంట గదిలో పనులు చేయడం లాంటి అంశాలను ఈ కోర్సు ద్వారా నేర్పనున్నారు.

దీనికి తోడు బహిరంగ ప్రదేశాల్లో ఐస్ క్రీమ్ ను నాకుతూ తినకూడదనే నిబంధనను బాగ్ సిలర్ మున్సిపాలిటీ తీసుకొచ్చింది. ఇలా తినడం సభ్యత కాదని తెలిపింది. మహిళలు తమ ముఖాన్ని కప్పుకోకుండా ఇతరులతో మాట్లాడటం తమ సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. సదరు మున్సిపాలిటీ విధించిన నిబంధనలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు.

istambul
bagsilar
municipality
women
course
conditions
  • Loading...

More Telugu News