YSRCP: ఫిబ్రవరిలో టీడీపీలో చేరనున్న సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు!

  • వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో టీడీపీ తీర్థం
  • తెనాలి అసెంబ్లీ సీటు కోరిన ఆదిశేషగిరిరావు
  • ఇవ్వకపోవడంతో వైసీపీకి ఇటీవల రాజీనామా

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన తన రాజకీయ భవిష్యత్ పై అనుచరులతో కలిసి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 లేదా 8న ఆదిశేషగిరిరావు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదిశేషగిరిరావు తెనాలి అసెంబ్లీ స్థానం కోరుకున్నప్పటికీ పార్టీ అధినేత జగన్ విజయవాడ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆయన టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

YSRCP
Telugudesam
febrauary
ghattamaneni
adiseshagiri rao
resign
join
  • Loading...

More Telugu News