Andhra Pradesh: విశాఖ నుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్.. అభిమానంతో కౌగిలించుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు!

  • పశ్చిమగోదావరికి ప్రవీణ్ కుమార్ బదిలీ
  • వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసిన నేతలు, అధికారులు
  • ప్రవీణ్ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని గంటా ఆకాంక్ష

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో దాదాపు ఆరేళ్ల పాటు విశాఖపట్నంలో సేవలు అందించిన ప్రవీణ్ కుమార్ కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ డీజీపీ సాంబశివరావు, ఇతర నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ప్రవీణ్ కుమార్ విశాఖలో ఆరేళ్ల పాటు వేర్వేరు హోదాల్లో పనిచేశారని తెలిపారు.

జిల్లాలో కలెక్టర్ గా ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు. ఆయన భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా సభా వేదిక వద్దకు వచ్చిన ప్రవీణ్ కుమార్ ను మంత్రి గంటా అభిమానంతో కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Andhra Pradesh
Visakhapatnam District
West Godavari District
District Collector
transfer
Ganta Srinivasa Rao
hug
sendoff meeting
  • Loading...

More Telugu News