Mallu Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా భట్టివిక్రమార్కను ప్రకటించిన స్పీకర్

  • అధికారికంగా ప్రకటించిన స్పీకర్‌ శ్రీనివాసరెడ్డి
  • ఇటీవల సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి
  • అభినందించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టివిక్రమార్కను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మధిర ఎమ్మెల్యేగా ఎన్నికైన భట్టివిక్రమార్కను ఇటీవ సీఎల్పీ లీడర్‌గా ఎంపిక చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ విషయాన్ని స్పీకర్‌కు తెలియజేశారు.

దీంతో స్పీకర్‌ ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భట్టివిక్రమార్కను విపక్ష నేతగా గుర్తిస్తూ ప్రకటన జారీ చేశారు. ఎంఐఎం పక్షం నేతగా అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఎంపికైన భట్టివిక్రమార్కను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. కాగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో ఎమ్మెల్యేగా స్పీకర్‌ ఈ రోజు ప్రమాణం చేయించారు.

Mallu Bhatti Vikramarka
opposition leader
  • Loading...

More Telugu News