Andhra Pradesh: అగ్రవర్ణాలకు సరే.. మరి, మా వర్గీకరణ ఎప్పుడు?: మంద కృష్ణ

  • ఫిబ్రవరి 19న అమరావతిలో బహిరంగ సభ
  • మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు
  • కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీీపీఐ నేత రామకృష్ణ

ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని వచ్చే నెల 19న అమరావతిలో విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధినేత మంద కృష్ణ మాదిగ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిందని, అయితే గత 25 సంవత్సరాలుగా పోరాడుతున్నా తమకు మాత్రం న్యాయం జరగలేదనీ, వర్గీకరణను కేంద్రం చేపట్టలేదని ఆయన విమర్శించారు.

విశ్వరూప మహాసభకు వామపక్ష పార్టీలను ఆహ్వానించామని పేర్కొన్నారు. మరోవైపు ఈ మహాసభకు వామపక్షాలు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడే వర్గీకరణకు తాము అనుకూలంగా తీర్మానం చేసి పంపామని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని తాము భావించామనీ, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రామకృష్ణ విమర్శించారు.

Andhra Pradesh
amaravati
viswaroopa mahasabha
sc
manda krishna
  • Loading...

More Telugu News