Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు మరో కీలక సంస్థ.. కడియంలో జాతీయ పూల పరిశోధనా కేంద్రం ఏర్పాటు!

  • జిల్లాలోని వేమగిరిలో స్థలం కేటాయించిన ప్రభుత్వం
  • ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రూ.5 కోట్ల వ్యయం
  • వివరాలు వెల్లడించిన టీడీపీ నేత మురళీమోహన్

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పూల పరిశోధన ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ తెలిపారు. ఈ కేంద్రానికి రేపు శంకుస్థాపన చేస్తామని ఆయన వెల్లడించారు. పూణే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్ కి అనుబంధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు.

రాజమండ్రిలో ఈరోజు ఓ కార్యక్రమం సందర్భంగా మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. కడియం సమీపంలోని వేమగిరిలో 10.77 ఎకరాల్లో రూ.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతీయ కేంద్రాన్నిఏర్పాటు చేస్తామని అన్నారు. కడియం వంగడాలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాజమండ్రి (రాజమహేంద్రవరం) విమానాశ్రయం నుంచి కార్గో సేవలు కూడా ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.

Andhra Pradesh
East Godavari District
kadiyam
flower institute
murali mohan
Telugudesam
  • Loading...

More Telugu News