Hyderabad: ఉగ్రదాడుల హెచ్చరికలతో శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద హై అలర్ట్‌

  • కేంద్ర హోం శాఖ ఆదేశాలతో చర్యలు
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు అవకాశమని హెచ్చరిక
  • నేటి నుంచి సందర్శకులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అధికారులు భద్రత పెంచారు. విస్తృత తనిఖీల నేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున ప్రయాణికులు కొంత ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని సహకరించాలని విమానాశ్రయం అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, భద్రతాపరమైన చర్యల్లో భాగంగా నేటి నుంచి ఈనె 31వ తేదీ వరకు సందర్శకులను విమానాశ్రయంలోకి అనుమతించడం లేదని అధికారులు ప్రకటించారు.

Hyderabad
samshabad airport
hai alert
  • Loading...

More Telugu News