Spain: స్పెయిన్ లో 330 అడుగుల బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడు.. జోరుగా సాగుతున్న సహాయక చర్యలు

  • గత ఆదివారం బోరుబావిలో పడిన బాలుడు 
  • బాలుడు జులెన్ కోసం ప్రార్థనలు
  • సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు

ప్రమాదవశాత్తు 330 అడుగుల లోతైన బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్పెయిన్‌‌లో జరిగిందీ ఘటన. మలాగాలోని టోటాలన్‌లో తమ ఎస్టేట్‌ను ఓ కుటుంబం పర్యవేక్షిస్తుండగా బాలుడు జులెన్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.

గత ఆదివారం ఈ ఘటన జరగ్గా అప్పటి నుంచి సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బావికి సమాంతరంగా టన్నెల్ తవ్వుతున్న అధికారులు బాలుడిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఘటన జరిగి ఇప్పటికే వారం రోజులు గడిచిపోవడంతో బాలుడు బతికి ఉండే అవకాశాలు కనిపించడం లేదు.  

సహాయక కార్యక్రమాల్లో స్థానికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలుడు క్షేమంగా ఉండాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. దేశం మొత్తం జులెన్ వెనకే ఉందని, ధైర్యంగా ఉండాలంటూ ఎక్కడికక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Spain
deep well
Borewell
Rescue operations
Totalan
Malaga
  • Loading...

More Telugu News