chopping off hand: కేంద్రమంత్రి రాంకృపాల్ యాదవ్ చేతిని నరికేయాలన్నంత కోపం వచ్చింది!: లాలు కుమార్తె మిసా భారతి

  • 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరిన కృపాల్ యాదవ్
  • ఆ ఎన్నికల్లో మిసా భారతిపై గెలుపు
  • ఆయనపై గౌరవం పూర్తిగా పోయిందన్న భారతి

ఆర్జేడీ ఎంపీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్ ఆర్జేడీని వీడి బీజేపీలో చేరినప్పుడు ఆయన చేతిని నరికివేయాలని అనిపించిందని పేర్కొన్నారు. పాట్నా సమీపంలోని ఆర్జేడీ కార్యకర్తల  సమావేశంలో మిసా భారతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘యాదవ్ బీజేపీలో చేరుతున్నట్టు తెలిసి నా కడుపు రగిలిపోయింది. ఆయన చేతిని నరికేయాలన్నంత కోపం వచ్చింది’’ అని పేర్కొన్నారు.

కృపాల్ యాదవ్ ఒకప్పుడు లాలు కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మిసా భారతిపై పోటీ చేసి విజయం సాధించారు. కృపాల్ యాదవ్ అంటే తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ బీజేపీతో ఆయన చేతులు కలిపి, సుశీల్ కుమార్ మోదీ పక్కన నిల్చున్నాక ఆయన మీద ఉన్న గౌరవం మొత్తం పోయిందని మిసా భారతి పేర్కొన్నారు.

chopping off hand
Misa Bharti
Ram Kripal Yadav
BJP
Lalu Prasad
  • Loading...

More Telugu News