Kajal Agarwal: క్యాస్టింగ్ కౌచ్ అసలు లేదని అనను: కాజల్ అగర్వాల్

  • నాకు ఎలాంటి చేదు అనుభవాలూ ఎదురుకాలేదు
  • మహిళలు హాయిగా పనిచేసుకునే వాతావరణం కావాలి
  • కెరీర్ పై ఆందోళనతోనే తమ బాధలను దాస్తున్నారన్న కాజల్

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అస్సలు లేదని తాను అననని, తనకు మాత్రం చేదు అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పరిశ్రమలో ఇబ్బందులు పడిన వాళ్లలో చాలామంది బయటకు వచ్చి చెబుతున్నదంతా వింటున్నామని, వాళ్లు కావాలని అబద్ధాలు చెబుతున్నారని ఎలా అనుకుంటామని ప్రశ్నించిన కాజల్, ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కోలా ఉంటుందని, తనకు కుటుంబం నుంచి మంచి సపోర్ట్‌ ఉండేదని చెప్పింది.

విషయం బయటకు చెబితే అవకాశాలు రావన్న భయంతోనే చాలామంది బయటకు రావడం లేదని, కెరీర్ పై ఆందోళనతోనే తమ అనుభవాలను ఎన్నో ఏళ్లు దాచిపెడుతున్నారని, ఇప్పుడు అవకాశం వచ్చి బయట పెడుతున్నారని అభిప్రాయపడింది. తన కెరీర్ ఆరంభం నుంచి ఎంతో కాలం పాటు తన తల్లి తనతోనే ఉందని, అందువల్లే తనను ఎవరూ ఇబ్బందులు పెట్టలేదని చెప్పింది. మహిళలు హాయిగా పని చేసుకునే వాతావరణం అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటున్నానని కాజల్ తెలిపింది.

Kajal Agarwal
Casting Couch
Tollywood
  • Loading...

More Telugu News