Madhya Pradesh: రేప్ కేస్ పెడతానని బెదిరించడం వల్లే.. ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు భయ్యూ!
- గత సంవత్సరం జూన్ 12న ఆత్మహత్య
- పెళ్లి చేసుకోకుంటే అత్యాచారం కేసు పెడతానన్న పలక్
- హైడోస్ మందులిస్తూ ఆత్మహత్యకు ప్రేరణ
మధ్యప్రదేశ్ లో ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్ (50) ఆత్మహత్య వెనుకగల కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ఆయన ఆశ్రమానికి చెందిన కొందరు హైడోస్ ఔషధాలు ఇవ్వడంతో పాటు ఆత్మహత్యకు పురికొల్పారని అన్నారు. అంతకుముందు తనను వివాహం చేసుకోకుంటే అత్యాచారం కేసు పెడతానని ఆయన సేవకురాలు పలక్ పురాణిక్ (25) బెదిరించిందని చెప్పారు.
పలక్ తో చేతులు కలిపిన ఆశ్రమానికి చెందిన వినాయక్, శరద్ లు భయ్యూ మహరాజ్ ఆస్తుల కోసం కుట్ర చేసి, ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఇండోర్ డీఐజీ మిశ్రా వెల్లడించారు. వీరి కుట్రతోనే భయ్యూ గత సంవత్సరం జూన్ 12న ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందుకు తగినన్ని సాక్ష్యాలను తాము సంపాదించామన్నారు. వీరిని కోర్టులో హాజరు పరిచామని, తదుపరి విచారణ కోసం 15 రోజుల కస్టడీకి తీసుకున్నామని తెలిపారు.