junior ntr: జూనియర్ ఎన్టీఆర్ ని నేను ‘టైగర్’ అనే పిలుస్తా: అఖిల్ అక్కినేని

  • నిజంగా, ఆయన ‘టైగరే’  
  • జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ వేరు
  • ‘తారక్ గారు’ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడు

జూనియర్ ఎన్టీఆర్ ని తాను ‘టైగర్’ అనే పిలుస్తానని, నిజంగా, ఆయన ‘టైగరే’ అనే అఖిల్ అక్కినేని ప్రశంసించాడు. హైదరాబాద్ లో నిర్వహించిన ‘మిస్టర్ మజ్ను’ ప్రీ-రిలీజ్ వేడుకలో అఖిల్ మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ వేరని కొనియాడాడు. ‘తారక్ గారు’ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడని, ఓ సందర్భంలో తాను ‘థ్యాంక్స్’ చెప్పినా కూడా ఒప్పుకోలేదని, ‘ఇది నా బాధ్యత’ అని తారక్ చేసిన వ్యాఖ్యలను అఖిల్ ప్రస్తావించాడు. అనంతరం, నాగార్జున మాట్లాడుతూ, తారక్ నుంచి అఖిల్ నేర్చుకోవాల్సింది ‘యాక్టింగ్, ‘మాస్’’ అని అనడంతో అభిమానులు చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.  

junior ntr
akhili akkineni
Nagarjuna
Mr.Majnu
  • Loading...

More Telugu News