Telangana: తెలంగాణ పీసీసీ ప్రక్షాళన ఖాయం.. ఉత్తమ్ ని పదవి నుంచి తప్పిస్తారు: సర్వే సత్యనారాయణ

  • టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పార్టీని భ్రష్టు పట్టించారు
  • రేపోమాపో ఆ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తారు
  • సీఎల్పీ నేతగా భట్టిని నియమించడంపై హర్షం

తెలంగాణ పీసీసీని కూడా ప్రక్షాళన చేయడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. పార్టీని భ్రష్టుపట్టించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేపోమాపో ఆ పదవి నుంచి తప్పిస్తారని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కనుక కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి ఉత్తమ్ కూడా కుట్ర చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని నియమించడం ద్వారా బడుగు వర్గాల ప్రజలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినట్టయిందని అన్నారు. భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకుడని సర్వే ప్రశంసించారు.

Telangana
pcc
survey satyanarayana
Uttam Kumar Reddy
Mallu Bhatti Vikramarka
Rahul
  • Loading...

More Telugu News