Trinamul congress: మోదీ ప్రభుత్వం గడువు ముగిసిపోయింది: సీఎం మమతా బెనర్జీ

  • ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేశారు
  • మోదీ హయాంలోనే  పెద్ద కుంభకోణాలు జరిగాయి
  • ఈ వేదిక ఐక్యభారత్ కు నిదర్శనం కావాలి

మోదీ ప్రభుత్వం గడువు ముగిసిపోయిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేశారని, మోదీ హయాంలోనే రాఫెల్ వంటి పెద్ద కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్, మాయావతి సహా ఎవరినీ వాళ్లు వదల్లేదని, వాళ్లతో కలిసి ఉంటే ఫర్వాలేదు కానీ, లేకపోతే అందరినీ అణగదొక్కుతారని విమర్శించారు. ఈ వేదిక ఐక్యభారత్ కు నిదర్శనం కావాలని పిలుపు నిచ్చారు.

Trinamul congress
mamata banerjee
modi
pm
  • Loading...

More Telugu News