ajith: తెలుగులో విడుదలకి సిద్ధమవుతోన్న 'విశ్వాసం'

- అజిత్ .. శివ నుంచి 'విశ్వాసం'
- ఈ నెల 10న తమిళనాట విడుదల
- వచ్చేనెల 1న తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్
అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వాసం' .. ఈ నెల 10వ తేదీన తమిళనాట భారీస్థాయిలో విడుదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాట రజనీకాంత్ 'పేట'తో పోటీపడుతూ ఈ సినిమా దూసుకుపోతోంది.
