Facebook: ఫేస్‌బుక్‌ మెడకు భారీ జరిమానా ఉచ్చు: డేటా బ్రీచ్‌ ఆరోపణల ఎఫెక్ట్‌

  • భారం రూ.16 వేల కోట్ల పైమాటే?
  • యూజర్ల వ్యక్తిగత వివరాలు అమ్ముకుందని ఆరోపణలు
  • ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎఫ్‌టీసీ

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. డేటా బ్రీచ్‌ ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థపై మరో పిడుగు పడేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల  డేటాను ఫేస్‌బుక్‌ అమ్ముకుంటోందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అమ్ముకుని సంస్థ లాభపడుతోందన్న ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమానా విధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం మేరకు ఫేస్‌బుక్‌కు దాదాపు రూ.16 వేల కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించవచ్చునని భావిస్తున్నారు. 2012లో గోప్యతా ఉల్లంఘనకు పాల్పడినందుకు గూగుల్‌పై ఎఫ్‌టీసీ ఇదే మొత్తం జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌పై విధించే జరిమానా అంతకంటే ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా లీకైందని, ఇకపై అటువంటి పొరపాటు జరగకుండా చూస్తామని ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. పత్రికల ద్వారా క్షమాపణలు కూడా తెలిపారు.

Facebook
data breech
hevy fine
  • Loading...

More Telugu News