CLP leader: భట్టి విక్రమార్క నియామకాన్ని సమర్థించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది
- అందుకే అధిష్ఠానం ఆయనవైపు మొగ్గుచూపింది
- పొత్తుల విషయం రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారు
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకునిగా పనిచేయాలని ఆశించి భంగపడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధిష్ఠానం నిర్ణయాన్ని సమర్థించారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు పదవి కట్టబెట్టం వంద శాతం సరైన నిర్ణయమని ప్రకటించారు. పదవి ఆశించడం తప్పుకాదని, ఈ విషయంలో తనకెటువంటి అసంతృప్తిలేదన్నారు. భట్టివిక్రమార్కకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే అధిష్ఠానం ఆయన వైపు మొగ్గుచూపిందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఏ ఒక్కరిదీ బాధ్యత కాదని, ఎన్నికల సమయంలో చేసిన కొన్ని తప్పిదాల వల్లే మునిగిపోయామని చెప్పారు. సీట్ల కేటాయింపులో కొన్ని తప్పిదాలు జరిగాయని, అలాగే టీడీపీతో పొత్తు నష్టం మిగిల్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు అంశంలో ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీదే అంతిమ నిర్ణయమన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని విడిచి వెళ్లే అవకాశం లేదని తెలిపారు.