venkatesh: కాకినాడలో ఎంతమాత్రం తగ్గని 'ఎఫ్ 2' జోరు

  • సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఎఫ్ 2'
  • తొలివారం షేర్ విషయంలో రికార్డు
  •  కాకినాడలో 4వ స్థానం    

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' ఈ నెల 12వ తేదీన విడుదలైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. పూర్తి హాస్యరసభరితంగా నిర్మితమైన ఈ సినిమా, రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.కాకినాడలో ఈ సినిమా తొలివారం సాధించిన షేర్ విషయంలో 4వ స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో 'బాహుబలి' .. 'బాహుబలి 2' ఉండగా, మూడవ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' వుంది. ఆ తరువాత స్థానంలో 'ఎఫ్ 2' నిలిచింది. 'భరత్ అనే నేను' .. 'రంగస్థలం'.. 'శ్రీమంతుడు'.. 'జనతా గ్యారేజ్' వంటి సినిమాల స్థానాలను దాటుకుని, కాకినాడలో 'ఎఫ్ 2' 4వ స్థానంలో నిలవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లోను ఈ సినిమా ఇదే ఊపును కొనసాగిస్తుండటం మరో విశేషం. 

  • Loading...

More Telugu News