Kadapa District: తన కుర్చీకే భద్రత లేదు కానీ.. దేశాన్ని కాపాడతారట: చంద్రబాబుపై రాంమాధవ్ ఫైర్

  • కూటమి పేరుతో చంద్రబాబు రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు
  • తెలంగాణలో మరో ఆయన కూడా అంతే..
  • కడపలో రాం మాధవ్ విమర్శలు

తన కుర్చీకే భద్రత లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేశాన్ని కాపాడతానంటూ మహాకూటమి పేరుతో రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం కడపలో జరిగిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో వ్యక్తి కూడా ఇలానే కూటమి పేరుతో హాస్యాస్పద రాజకీయం చేస్తున్నారని పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంపై నిందలేయడాన్ని, తిట్టడాన్నే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కడపకు ఉక్కు పరిశ్రమ రావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు రాసిన  ‘చారిత్రక అవసరం మళ్లీ మోదీ’ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆవిష్కరించారు.  

Kadapa District
Ram madhav
BJP
Kanna Laxminarayana
Rajnath singh
  • Loading...

More Telugu News