Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్పేది ఇదే..!: కడపలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

  • కడపలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం
  • హాజరైన కేంద్రం హోం మంత్రి
  • చంద్రబాబు తమకు సహకరించడం లేదన్న మంత్రి

కడపలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఏపీ ప్రజలకు తాను చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాకుండా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా మంత్రం జపిస్తూ కేంద్రానికి సరైన సలహాలు, సూచలను ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఏపీలో పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం సాధించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు. మరో రెండేళ్లలో వందశాతం ప్రగతి సాధిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవంలో దేశ గౌరవం.. దేశ గౌరవంలో ఆంధ్రప్రదేశ్ గౌరవం ఇమిడి ఉన్నాయన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తాము సుముఖంగా ఉండబట్టే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Andhra Pradesh
Kadapa District
Rajnath singh
Chandrababu
  • Loading...

More Telugu News