Telugudesam: మా మూడు గిఫ్ట్ లు కేసీఆర్ దిమ్మ తిరిగేలా ఉంటాయి: టీడీపీ నేత వర్ల రామయ్య

  • కొంచెం ఓపిక పట్టండి
  • కేసీఆర్ తలకు పట్టిందంతా వదిలిపోతుంది
  • బూతులు మాట్లాడుతూ ఇది మా భాష అంటారా!

కేసీఆర్  రిటర్న్ గిఫ్ట్ కు బదులుగా ఆయనకు  తిరిగి మూడు గిఫ్ట్ లిస్తానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. ‘ఆ మూడు గిఫ్ట్ లు ఎలా ఉంటాయి?’ అన్న ప్రశ్నకు టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ, ‘మా మూడు గిఫ్ట్ లు కేసీఆర్ దిమ్మ తిరిగేలా ఉంటాయి. కొంచెం ఓపిక పట్టండి. కేసీఆర్ తలకు పట్టిందంతా వదిలిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబుని, టీడీపీని విమర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుతున్న భాష సరిగా లేదని, బూతులు మాట్లాడుతున్న ఆయన, ‘ఇది తెలంగాణ భాష’ అని సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న పదజాలం ఏమాత్రం పద్ధతిగా లేదని తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. 

Telugudesam
TRS
varla ramaiah
kcr
Telangana
  • Loading...

More Telugu News