Vijayawada: విజయవాడ వచ్చి తలసాని హల్ చల్ చేస్తే.. నేను హైదరాబాద్ వచ్చి చేస్తా: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • తలసానికి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ చెబుతున్నా  
  • మీ తెలంగాణలో మీరు రాజకీయం చేసుకోండి
  • మా ఏపీలో మేము రాజకీయం చేసుకుంటాం

మొన్న విజయవాడ వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుపైన, టీడీపీపైన పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయారని, ఈసారి కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్షమించమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

‘మీరు విజయవాడ వచ్చి హల్ చల్ చేస్తున్నాననుకుంటున్నారు. మీరు, విజయవాడ వచ్చి హల్ చల్ చేస్తే.. నేను హైదరాబాద్ వచ్చి హల్ చల్ చేస్తా. మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ చెబుతున్నా.. మీ తెలంగాణలో మీరు రాజకీయం చేసుకోండి. మా ఆంధ్రప్రదేశ్ లో మేము రాజకీయం చేసుకుంటాం. మీరేదో ఇక్కడ రాజకీయం చేస్తా, తిరుగుతానంటే.. మీరు మూడొందల మందినో నాల్గొందల మందినో వేసుకొని ఇక్కడికి వచ్చారు. నేను సింగిల్ గా హైదరాబాద్ నడిరోడ్డులో ఛాలెంజ్ చేస్తాను.. కాస్కోండి’ అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

Vijayawada
TRS
talasani
Hyderabad
buddha venkanna
Telugudesam
  • Loading...

More Telugu News