KTR: కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదు: వంటేరు ప్రతాపరెడ్డి

  • గెలవాలనే మాత్రమే పోటీ చేశా
  • గతంలోనే కేటీఆర్ కోరారు
  • రైతులు అండగా నిలిచారు

కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషమంటూ ఏమీలేదని.. ఎన్నికల్లో గెలవాలని మాత్రమే పోరాటం చేశానని.. వంటేరు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ.. గతంలోనే పార్టీలోకి రావాలని కేటీఆర్ మూడు సార్లు కోరారని.. అప్పుడే చేరి ఉంటే బాగుండేదన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు రైతులు అండగా నిలిచారని వంటేరు కితాబిచ్చారు.

KTR
KCR
TRS
Vanteru Prathapareddy
Gajwel
  • Loading...

More Telugu News