jagan: జగన్ గారు.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి: కళా వెంకట్రావు బహిరంగ లేఖ

  • రైతులకు మీరు చేసిందేమిటో ఆత్మవిమర్శ చేసుకోండి
  • ఏపీని ఎడారిగా మార్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు
  • కేసీఆర్ కుట్రలో మీరు పావుగా మారారు

వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రైతుల కోసం ప్రతిపక్ష నేతగా తమరు చేసిందేమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని లేఖలో కోరారు. ఏపీలో తాగేందుకు కూడా నీరు లేకుండా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నిన కుట్రలో తమరు పావుగా మారుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తున్న కేసీఆర్ కు అండగా నిలిచారని విమర్శించారు. ఏపీకి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వైసీపీ నేతలే కాంట్రాక్టర్లుగా ఉన్నారని... ఈ విషయం జగమెరిగిన సత్యమని చెప్పారు.

jagan
kala venkatrao
open letter
Telugudesam
ystcp
TRS
kcr
  • Loading...

More Telugu News