Chandrababu: అప్పుడే చంద్రబాబు దుష్ప్రచారం ప్రారంభించారు: భూమన కరుణాకర్ రెడ్డి

  • రాష్ట్రాల హక్కులు సాధించేందుకే కేటీఆర్-జగన్ భేటీ
  • చంద్రబాబు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారు
  • జగన్ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారు

టీఆర్ఎస్-వైసీపీలు పొత్తుపెట్టుకుంటున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడే దుష్ప్రచారం ప్రారంభించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాల హక్కులు సాధించే క్రమంలోనే కేటీఆర్-జగన్ ల భేటీ జరిగిందని, ఈ భేటీపై వక్రభాష్యాలు చెప్పడం తగదని హితవు పలికారు. చంద్రబాబు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, కొత్తగా ఆయనకు మానసిక రుగ్మత కూడా తోడైనట్టయిందని వ్యాఖ్యానించారు. జగన్ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారని, ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Telugudesam
YSRCP
bhumana karunakar reddy
tirupathi
kcr
TRS
Jagan
  • Loading...

More Telugu News