avasarala: హిట్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్

- దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్
- నాగశౌర్య నుంచి గ్రీన్ సిగ్నల్
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
నటుడిగా .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక హీరోగా నాగశౌర్య యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఊహలు గుసగుసలాడే' ..' జ్యో అచ్యుతానంద' విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది.
