Mahesh Babu: 'హైవే మాఫియా' నేపథ్యంలో మహేశ్ .. విజయ్ .. యష్ హీరోలుగా ఆయా భాషల్లో సినిమా!

- సుచిత్రారావు రచించిన 'ది హైవే మాఫియా'
- అన్ని భాషల్లో తెరకెక్కాలనే ఆలోచన
- నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు
తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ మధ్య సందేశాత్మక చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ సందేశాత్మక కథ సిద్ధమైంది. దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల అక్రమ రవాణా చేసే మాఫియాపై రచయిత్రి సుచిత్రరావు ఒక పుస్తకం రాశారు. 'ది హైవే మాఫియా' పేరుతో క్రితం ఏడాది ఆమె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
