Telangana: తెలంగాణలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు గుర్తింపులేదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసే వారికే ప్రాధాన్యత ఉంది
  • కష్టపడే నాయకులను కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి
  • ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్ కు పుల్ స్టాఫ్ పెట్టాలి

తెలంగాణలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం గుర్తింపు లేదని, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసే వారికే ప్రాధాన్యత ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కష్టపడే నాయకులను కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని, ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్ కు పుల్ స్టాఫ్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ లాబీయింగ్ తో సీఎల్పీ ఎన్నిక జరిగితే పార్టీకే నష్టమన్న విషయాన్ని అధిష్ఠానం గుర్తించాలని కోరిన జగ్గారెడ్డి, కుల, మతాలకు సంబంధం లేకుండా రాజకీయాలు రావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telangana
congress
mla jagga reddy
sangareddy
  • Loading...

More Telugu News