NTR: 36 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

  • సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
  • ఒక మహానాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ తో ఎవరూ పోటీ పడలేరు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ ప్రారంభించారు. ఎన్టీఆర్ సాగర్ లో బోటులో చంద్రబాబు, స్పీకర్ కోడెల విహరించారు. తారకరామనగర్ లో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించి నివాళులర్పించారు.

అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, ఒక మహానాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని, చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడని అన్నారు. ఎన్టీఆర్ తో ఎవరూ పోటీ పడలేరని, ఆయనకు ఆయనే సాటి అని ప్రశంసించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి, సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని నిర్వచించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు.

NTR
sattenapally
Chandrababu
kodela
speaker
  • Loading...

More Telugu News