India: మమత అక్కయ్య.. నా ఫుల్ సపోర్ట్ నీకే!: రాహుల్ గాంధీ ప్రకటన

  • రేపు కోల్ కతాలో విపక్షాల ర్యాలీ
  • మోదీ బూటకపు హామీలు ఇచ్చారన్న రాహుల్
  • అందువల్లే విపక్షాలు ఏకమవుతున్నాయని వ్యాఖ్య

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు కోల్ కతాలో నిర్వహించనున్న ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మద్దతును ప్రకటించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఆగ్రహావేశాల కారణంగానే ఈ విపక్షాలు ఏకం అవుతున్నాయని రాహల్ అన్నారు. ఈ ప్రజలంతా మోదీ ప్రభుత్వపు బూటకపు హామీలు, అబద్ధాలతో మోసపోయారని వ్యాఖ్యానించారు.

మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని రాహుల్ పునరుద్ఘాటించారు. హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారని రాహుల్ ప్రశంసించారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడం ద్వారా బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మమతకు రాసిన లేఖను రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..

India
Narendra Modi
bjp
opposition
Rahul Gandhi
Congress
support
  • Loading...

More Telugu News