Rahul Gandhi: ఈ ఒక్క కండిషన్ కు ఒప్పుకుంటే మీకు పూర్తి మద్దతు ఇస్తా: రాహుల్ గాంధీకి ఒవైసీ ఆఫర్

  • ప్రకాశ్ అంబేద్కర్ కోరుకున్నన్ని సీట్లు ఇవ్వండి
  • మాకు ఒక్క సీటు కూడా వద్దు
  • రాహుల్ తనను తాను సమీక్షించుకునేందుకు ఇదే సరైన సమయం

మహాకూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. మహాకూటమిలో ప్రకాశ్ అంబేద్కర్ కు చెందిన బారిప్ బహుజన్ మహాసంఘ్ పార్టీకి గౌరవ స్థాయిలో సీట్లను కేటాయిస్తే కాంగ్రెస్ కు తాను పూర్తిగా మద్దతిస్తానని ఒవైసీ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రకాశ్ అంబేద్కర్ కోరుకున్నన్ని సీట్లు ఇవ్వాలని... మహారాష్ట్రలో ఎంఐఎంకు ఒక్క సీటు కూడా అవసరం లేదని చెప్పారు.

రాహుల్ గాంధీ, శరద్ పవార్ లకు ఎంఐఎంతో సమస్య ఉంటే... తన పెద్దన్నయ్య ప్రకాశ్ అంబేద్కర్ తో మాట్లాడాలని ఒవైసీ అన్నారు. ప్రకాశ్ అంబేద్కర్ స్థాయికి తగ్గట్టుగా సీట్లను ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. రాహుల్ గాంధీ తనను తాను సమీక్షించుకునేందుకు ఇది సరైన సమయమని చెప్పారు.

Rahul Gandhi
Asaduddin Owaisi
sharad pawar
prakash ambedkar
congress
mim
  • Loading...

More Telugu News