chiranjeevi: చిరూ సరసన మళ్లీ నయనతార?

  • సెట్స్ పై చిరంజీవి 'సైరా'
  • తదుపరి సినిమా కొరటాలతో
  • నయనతారతో సంప్రదింపులు    

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, ఆగస్టు 15న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత కొరటాలతో చిరంజీవి చేయనున్న సినిమాలోను కథానాయికగా నయనతారనే తీసుకోనున్నారని తెలుస్తోంది.

చిరంజీవి .. కొరటాల సినిమాలో కథానాయిక పాత్ర కోసం అనుష్క .. కాజల్ .. శ్రియ .. త్రిష .. శ్రుతిహాసన్ పేర్లను పరిశీలించారట. చివరికి మళ్లీ నయతారనే తీసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు మొదలైపోయినట్టు సమాచారం. సీనియర్ హీరోయిన్ గా నయనతారకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే తీసుకోవాలనే బలమైన నిర్ణయంతో టీమ్ ఉందట. అందువలన దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైపోవచ్చని అంటున్నారు.

chiranjeevi
nayanatara
  • Loading...

More Telugu News