Andhra Pradesh: నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్.. 30 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం ఆవిష్కరణ!

  • సత్తెనపల్లిలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
  • తారకరామ సాగర్ ను ప్రారంభించనున్న ఏపీ సీఎం
  • జెడ్పీ బాలికల పాఠశాలలో బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత సత్తెనపల్లిలోని చెరువులో ఏర్పాటు చేసిన 30 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.

అనంతరం రూ.10 కోట్లతో అభివృద్ధి చేసిన తారకరామ సాగర్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సత్తెనపల్లి జడ్పీ బాలికల పాఠశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ తో పాటు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Guntur District
30 feet
ntr
statue
  • Loading...

More Telugu News