Andhra Pradesh: పొగమంచుతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!

  • ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘటన
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
  • నంద్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు

మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో వేగంగా వెళుతున్న ఓ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో దాదాపు 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాలకు ఈరోజు బయలుదేరింది.

మంచు బాగా కురుస్తుండటంతో రోడ్డుపై దారి సరిగ్గా కనిపించలేదు. ఈ క్రమంలో రోడ్డు మలుపును డ్రైవర్ గమనించలేకపోవడంతో వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, దాదాపు 10 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh
Kurnool District
Nellore District
Road Accident
10 injured
rtc bus
  • Loading...

More Telugu News