Andhra Pradesh: వెండితెరపై కథానాయకుడు.. రాజకీయాల్లో ప్రజానాయకుడు!: ఎన్టీఆర్ కు లోకేశ్ నివాళి

  • ప్రజానాయకుడిగా ఓ యుగానికి విస్తరించారు
  • ఆయన చరిత్రను మననం చేసుకుందామని వ్యాఖ్య
  • నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వెండితెరపై కథానాయకుడిగా, రాజకీయాల్లో నిరుపేదలకు బంధువుగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజానాయకుడిగా తన జీవితాన్ని ఓ యుగానికి విస్తరించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఈరోజు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా లోకేశ్ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వెండితెరపై మంచికి అండగా నిలిచిన కథానాయకుడిగా, రాజకీయాలలో నిరుపేదకు బంధువై నిలిచిన ప్రజా నాయకుడిగా, తన జీవితకాలాన్ని ఒక యుగానికి విస్తరించుకున్న ప్రజల మనిషి, కీర్తిశేషులు మా తాతగారు ఎన్టీఆర్. ప్రాతః స్మరణీయులైన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఘనచరిత్రను మననం చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
ntr
23rd anniversary
  • Loading...

More Telugu News