Vijayawada: తలసాని మీడియా సమావేశం ప్రభావం... కనకదుర్గ గుడిలో నిషేధాజ్ఞలు!

  • దుర్గమ్మ సన్నిధిలో తలసాని రాజకీయ వ్యాఖ్యలు
  • ఆలయ పరిసరాల్లో ఇకపై మీడియా సమావేశాలు నిషిద్ధం
  • దుర్గమ్మ ప్రతిష్ఠను పెంచడానికేనన్న ఈవో

టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకుని బయటకు వచ్చిన వేళ, తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈవో చాంబర్ వద్దే తలసాని మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.

ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని ఈవో కోటేశ్వరమ్మ ఆదేశించారు. గుడికి వచ్చే ప్రముఖులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరాదని ఆమె అన్నారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయ ప్రకటనలు, వ్యాపారాలకు సంబంధించిన బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా నిషేధించారు. ఇంద్రకీలాద్రి ప్రతిష్ఠను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఈవో కోటేశ్వరమ్మ తెలియజేశారు.

Vijayawada
Talasani
Indrakeeladri
Ban
Media Meetings
  • Loading...

More Telugu News