YSRCP: జగన్ సోదరి షర్మిలపై దుష్ప్రచారం చేసిన 12 వెబ్‌సైట్ల గుర్తింపు

  • షర్మిలపై అసత్య ప్రచారం
  • వెబ్‌సైట్లను గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు
  • ఐపీ అడ్రస్‌ల కోసం గూగుల్‌కు లేఖ

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాన్ని అంటగడుతూ జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షర్మిలపై  అసత్య ప్రచారం చేసిన 12 వెబ్‌సైట్లను గుర్తించారు. వాటి ఐపీ అడ్రస్‌లు తెలుసుకునేందుకు గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

గూగుల్ నుంచి ఆ వివరాలు అందిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇందుకు మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గూగుల్ నుంచి వివరాలు అందగానే నిందితుల వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  

మరోవైపు, నిరాధారపూరిత కథనాలపై షర్మిల ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులు తమ సైట్ల నుంచి ఆ కథనాలను తొలగించారు. వాటిని అన్‌పబ్లిష్ చేసినా నిందితులను మాత్రం వదిలేది లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

YSRCP
Jagan
YS Sharmila
Web sites
Tollywood
Prabhas
cyber crime
  • Loading...

More Telugu News