mayavati: అప్పట్లో మాయావతి నాపై లైంగిక ఆరోపణలు చేశారు!: అఖిలేష్ చిన్నాన్న శివపాల్ యాదవ్

  • నార్కో టెస్టును ఎదుర్కోవడానికి ఒప్పుకోలేదు
  • మాయావతిని గుడ్డిగా నమ్మవద్దు
  • ములాయంను కూడా దుర్భాషలాడారు

బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ కు ఆయన చిన్నాన్న శివపాల్ యాదవ్ హెచ్చరిక జారీ చేశారు. మాయావతిని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. 1995లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తును తెగదెంపులు చేసుకుని... బీజేపీ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర మాయావతిదని గుర్తు చేశారు. యూపీలోని చందోలీలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో తనపై లైంగిక వేధింపుల ఆరోపణలను కూడా మాయావతి చేశారని శివపాల్ అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని, నార్కో టెస్టుకు కూడా రెడీ అని చెప్పానని... అయితే, మాయావతికి కూడా నార్కో టెస్టు చేయాలని కండిషన్ పెట్టానని, దానికి ఆమె తిరస్కరించారని తెలిపారు. టికెట్లు అమ్ముకునే వారిని నమ్మలేమని శివపాల్ అన్నారు. నేతాజీ (ములాయం)ని దుర్భాషలాడిన మాయావతిని నమ్మవద్దని చెప్పారు. ఆమెకు ఎన్నో సీట్లు రావని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరు పార్టీలు చెరో సగం సీట్లను పంచుకున్నాయి.

mayavati
akhilesh yadav
shivpal yadav
mulayam singh
Uttar Pradesh
sp
bsp
  • Loading...

More Telugu News