Telangana: ఈరోజు ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే

  • ప్రమాణస్వీకారం చేసిన వారి సంఖ్య 114
  • సభకు గైర్హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు
  • ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ఉండటంతో సభకు రాని రాజాసింగ్

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా... 114 మంది ప్రమాణం చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, రాజా సింగ్, సండ్ర వెంకటవీరయ్యలు సభకు హాజరుకాలేదు. ఎంఐఎంకు చెందిన వ్యక్తి స్పీకర్ ఛైర్ లో ఉంటే... తాను ప్రమాణస్వీకారం చేయనని ఇంతకు ముందే రాజాసింగ్ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఆయన ప్రమాణస్వీకారం చేయలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాల వల్ల సభకు రాలేకపోయారు.

Telangana
mla
oath
absent
  • Loading...

More Telugu News