Asaduddin Owaisi: అక్కడ తొడ కొట్టడం కాదు.. దమ్ముంటే నాపై పోటీ చెయ్: ఒవైసీకి ఏపీ మంత్రి ఫరూక్ సవాల్

  • దమ్ముంటే నంద్యాలలో పోటీ చెయ్
  • మూడో ఫ్రంట్ కు అవకాశం లేదు
  • ముడుపుల కోసమే జగన్, కేటీఆర్ ల భేటీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఏపీ మంత్రి ఫరూక్ సవాల్ విసిరారు. పాతబస్తీలో సొంత సామ్రాజ్యంలో తొడగొట్టడం కాదని... దమ్ముంటే నంద్యాలలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఏపీకి వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసే సంగతిని పక్కన పెట్టి... ముందుగా సికింద్రాబాద్ లో పోటీ చేసి గెలవాలని అన్నారు. 'బీజేపీ ఏజెంట్ ఒవైసీ' అని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో మూడో ఫ్రంట్ కు అవకాశం లేదని చెప్పారు. ముడుపుల కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్, కేటీఆర్ లు భేటీ అయ్యారని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi
farooq
Telugudesam
mim
jagan
KTR
TRS
ysrcp
  • Loading...

More Telugu News