Rishab Pant: ఇది అఫీషియల్... రిషబ్ పంత్ కి కాబోయే జీవిత భాగస్వామి ఈమే!

  • ఇషా నేగితో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన పంత్
  • 'నిన్ను సంతోషంగా ఉంచడమే నా పని' అంటూ కామెంట్
  • జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు

భారత క్రికెట్ యువ సంచలనం రిషబ్ పంత్, ఇటీవలి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో ఎంత బాగా రాణించాడో అందరికీ తెలిసిందే. ఆసీస్ గడ్డపై టెస్ట్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ నిలిచిన పంత్, 350 పరుగులు చేయడమే కాకుండా, తనను ట్రోల్ చేసిన టిమ్ పేన్ కు సరైన జవాబిచ్చాడు. ఇక తానింత ఉల్లాసంగా ఉండేందుకు కారణం ఎవరో చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో రిషబ్ పంత్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న పంత్ ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్పేశాడు. "నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నువ్వే.. అందుకే నిన్ను సంతోషంగా ఉంచడమే నా పని" అని క్యాప్షన్ పెట్టాడు.

ఇంతకీ ఈ అమ్మాయి వివరాలు తెలుసా? పేరు ఇషా నేగి. ఆమె ఓ వ్యాపారవేత్త. ఇంటీరియర్ డిజైనర్ గానూ పనిచేస్తోంది. ఇక ఇదే ఫోటోను ఆమె తన ఖాతాలో కూడా షేర్ చేసుకుంటూ, "నా మనిషి, నా సోల్‌ మేట్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియుడు" అంటూ తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టింది. ఇక వీరిద్దరి జంటా చూడముచ్చటగా ఉందంటూ, పంత్ ప్రేమలో పడ్డాడంటూ, పంత్ కాబోయే జీవిత భాగస్వామి అందంగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి.

Rishab Pant
Esha Negi
Love
Instagram
  • Loading...

More Telugu News