Telangana: చంద్రబాబుతో పొత్తుకు కేసీఆర్ అంగీకరించివుంటే...: కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!

  • పొత్తు కుదిరుంటే చంద్రబాబు విజయమనేవారు
  • తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంటూ డప్పు కొట్టేవారు
  • ఒప్పుకోకపోయేసరికి ద్రోహులా?: కన్నా విసుర్లు

తెలంగాణలో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైన తరువాతే, చంద్రబాబు, కాంగ్రెస్ తో పొత్తును పెట్టుకున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "కేసీఆర్ పొత్తుకు ఒప్పుకుని ఉంటే... తెలుగువారంతా ఒకటయ్యారు. ఇది చంద్రబాబు విజయం. ఇక రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని డప్పు కొట్టేవారు. కేసీఆర్ పొత్తుకు ఒప్పుకోలేదు కాబట్టి... తెలుగుజాతి ద్రోహులు కేసీఆర్, జగన్. మోడీతో కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.



Telangana
Andhra Pradesh
Telugudesam
KCR
Chandrababu
TRS
Kanna Lakshminarayana
  • Loading...

More Telugu News