Arun Jaitly: జైట్లీ గారు.. ఈ కష్టకాలంలో మీతో, మీ కుటుంబంతో ఉంటాం: రాహుల్ గాంధీ
- జైట్లీ ఆనారోగ్యం వార్తతో ఆవేదనకు గురయ్యా
- ఆయన త్వరగా కోలుకోవాలన్న రాహుల్
- సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్న ఒమర్ అబ్దుల్లా
అనారోగ్య కారణాలతో చికిత్స నిమిత్తం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయనకు మూత్రపిండాల మార్పిడి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జైట్లీ అనారోగ్యం పట్ల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
'అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి తెలిసి చాలా ఆవేదనకు గురయ్యాను. పలు విషయాలపై ప్రతి రోజూ ఆయనతో పోరాడుతూనే ఉంటాం. కానీ, ఇప్పుడు ఆయనకు నేను, కాంగ్రెస్ పార్టీ ప్రేమాభిమానాలను అందిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. జైట్లీ గారూ, ఈ కష్టకాలంలో మీతో, మీ కుటుంబంతో వంద శాతం ఉంటాం' అని ట్వీట్ చేశారు.
అరుణ్ జైట్లీ తొందరగా కోలుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ఆయన ఇండియాకు తిరిగి వస్తారని ట్వీట్ చేశారు.