KCR: కేసీఆర్, జగన్ భేటీ ఎప్పుడంటే..!

  • తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్న జగన్
  • ఫిబ్రవరి 14న గృహ ప్రవేశం
  • ఆ కార్యక్రమానికి వెళ్లనున్న కేసీఆర్

"టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, స్వయంగా అమరావతికి వెళ్లి జగన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై మాట్లాడతారు"... ఇవి నిన్న జగన్ తో తన భేటీ అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక అప్పటి నుంచి జగన్ ను కలిసేందుకు కేసీఆర్ ఎప్పుడు అమరావతికి వెళతారా? అన్న చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటికే వీరిద్దరి కలయికపై తేదీ సమయం ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది.

అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తాను నిర్మించుకున్న ఇంట్లో వచ్చే నెల 14వ తేదీన గృహ ప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించుకున్న జగన్, ఆ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక, జగన్ గృహ ప్రవేశానికి వెళ్లి రావాలని భావిస్తున్న కేసీఆర్, ఫెడరల్‌ ఫ్రంట్‌ పై తన మనసులోని మాటను అక్కడే జగన్ తో చెప్పాలని అనుకుంటున్నారట. తామిద్దరి మధ్యా జరిగిన చర్చల వివరాలను జగన్ ముందే కేటీఆర్ ఫోన్ ద్వారా కేసీఆర్ కు తెలియజేసినప్పుడు, చివర్లో జగన్ మాట్లాడుతూ, కేసీఆర్ ను గృహ ప్రవేశానికి ఆహ్వానించినట్టు సమాచారం.

KCR
Jagan
Tadepalli
House Warming
KTR
  • Loading...

More Telugu News