Odisha: మంటగలిసిన మానవత్వం... ఎవరూ సాయం రాక, తల్లి మృతదేహాన్ని సైకిల్ పై మోసుకెళ్లిన మైనర్!

  • అంత్యక్రియలు జరిపించేందుకు ముందుకురాని గ్రామస్థులు
  • స్వయంగా మోసుకెళ్లి ఖననం చేసిన కుమారుడు
  • ఒడిశాలోని ఝార్సీగూడ జిల్లాలో ఘటన

తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక, ఓ చాపలో ఆమెను చుట్టి, భుజానికి ఎత్తుకుని నడుస్తూ వెళ్లిన మాంఝీ ఘటనను మరువకముందే, అదే ఒడిశా రాష్ట్రంలోని ఝార్సీగూడ జిల్లా కర్పబహాల్ లో మరో ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, భర్త లేని జానకి అనే మహిళ పుట్టింట్లో తన కుమారునితో కలసి నివాసం ఉండేది. నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లగా, అది కూలి ఆమె మరణించింది. ఆమె అంత్యక్రియలు జరిపించేందుకు గ్రామస్థులు ముందుకు రాలేదు. దీంతో ఆమె 17 సంవత్సరాల కుమారుడు, తల్లి శవాన్ని సైకిల్ పై వేసుకుని, సమీపంలోని అడవికి తీసుకెళ్లి, స్వయంగా గుంత తవ్వి ఖననం చేశాడు.  

Odisha
Mother
Died
Son
Cycle
  • Loading...

More Telugu News