Mumbai: ముంబై దేవాలయంలో ఉరేసుకుని మరాఠీ సినీ నిర్మాత ఆత్మహత్య!

  • లాండాంచా గణపతి దేవాలయంలో ఘటన
  • ఆత్మహత్య చేసుకున్న సదానంద్ అలియాస్ పప్పూ లాడ్
  • ఓ బిల్డర్ వేధిస్తున్నాడని సూసైడ్ లేఖ

ముంబైలోని ఎంఎస్ అలీ రోడ్డులో ఉన్న లాండాంచా గణపతి దేవాలయంలో సినీ నిర్మాత, మాజీ ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుడు సదానంద్ అలియాస్ పప్పూ లాడ్ (51) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ ను కనుగొన్నారు. ఇందులోని వివరాల ప్రకారం, ఓ బిల్డర్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, అతని వేధింపులను తట్టుకోలేకనే ప్రాణాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, ఎల్జీ ప్రొడక్షన్స్ పేరిట ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసిన పప్పూ లాడ్, పలు మరాఠీ సినిమాలను నిర్మించారు.

Mumbai
Producer
Sadanand
Pappu Lad
Sucide
  • Loading...

More Telugu News